CSK vs SRH ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 29వ మ్యాచ్

CSK vs SRH ప్రిడిక్షన్ 2023 (CSK vs SRH Prediction 2023) : IPL 2023 హైదరాబాద్ మరియు చెన్నై జట్ల మధ్య 29వ మ్యాచ్ జరగతుంది. ఉత్తమ క్రికెటరైన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఏప్రిల్ 21 శుక్రవారం రోజున రాత్రి 7:30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆడనున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 17వ మ్యాచులో హోం గ్రౌండులో ఓడిపోయిన చెన్నై జట్టు, SRH మీద గెలిచి ఫ్యాన్స్‌ను సంతోషపెట్టాలని భావిస్తుంది. RCB మీద గెలిచి ఏకంగా మూడవ స్థానానికి వెళ్లిన చెన్నై, ఈ మ్యాచులో కూడా గెలిచి టైటిల్ రేసులో దూసుకెళ్లాలని భావిస్తుంది.

CSK Vs SRH ప్రిడిక్షన్ 2023 : RCB పైన అద్భుత విజయం సాధించిన CSK

ఏప్రిల్ 17న జరిగిన ఐపిఎల్ మ్యాచులో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు RCB మీద అద్భుత విజయం సాధించింది. 17వ మ్యాచులో హోం గ్రౌండ్ చెన్నైలో ఓడిన CSK, 24వ మ్యాచులో బెంగుళూరు హోం గ్రౌండులో వారిని ఓడించింది. CSK బ్యాట్స్‌మెన్లు అయిన డెవెన్ కాన్వాయ్ 45 బంతుల్లో 83 పరుగులు చేయగా, శివమ్ దూబే 27 బంతుల్లో 52 రన్స్, అజింక్యా రహానే 20 బాల్స్‌లో 37 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో చెన్నై బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, బౌలర్స్ వైడ్ బాల్స్, నో బాల్స్ ఎక్కువ వేస్తున్నారు. హోం గ్రౌండ్ చెన్నైలో ఓటమి పాలై అందర్నీ నిరాశపర్చిన CSK, బెంగళూరు మీద మ్యాచ్ గెలిచి తిరిగి రేసులో నిలిచింది. ప్రస్తుతం చెన్నై 5 మ్యాచుల్లో 3 మ్యాచ్స్ గెలవగా, నెట్ రన్ రేట్ +0.265 ఉంది. అలాగే RCBతో జరిగిన మ్యాచులో మంచి విజయం సాధించి, CSK సత్తా ఏమిటో చూపించింది. మరి హైదరాబాత్‌తో జరిగే మ్యాచులో ఏ విధంగా ఆడతారో చూడాలి.

CSK Vs SRH ప్రిడిక్షన్ 2023 : CSK ముగ్గురు బ్యాట్స్‌మెన్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

రుతురాజ్ గైక్వాడ్

41

1407

డెవెన్ కాన్వాయ్

12

433

అజింక్యా రహానే

161

4203

CSK Vs SRH ప్రిడిక్షన్ 2023 : CSK ముగ్గురు బౌలర్స్

ఆటగాడు

Ipl మ్యాచ్స్

వికెట్లు

రవీంద్ర జడేజా

215

138

మొయిన్ అలీ

48

30

తుషార్ దేశ్ పాండే

12

14

CSK Vs SRH ప్రిడిక్షన్ 2023 : మళ్లీ ఓడిపోయిన SRH

IPL సీజన్ 2023లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన హైదరాబాద్ టీం, ఆ తర్వాత రెండింట్లో గెలిచింది. అయితే, ఏప్రిల్ 18న జరిగిన మ్యాచులో మాత్రం ముంబయి ఇండియన్స్ మీద మళ్లీ ఓడిపోయింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగ్గా, హోం గ్రౌండులో SRH ఓడిపోయి అభిమానుల్ని నిరాశపర్చింది. 15 ఓవర్స్ వరకూ SRH బౌలింగ్ పర్లేదు అనిపించగా, చివరి ఐదు ఓవర్లో SRH బౌలర్స్ భారీగా పరుగులు సమర్పించారు. దీంతో ముంబయి 192 రన్స్ చేయగా, SRH 178 పరుగులకు ఆలౌట్ అయింది. SRH జట్టు కెప్టెన్ మార్క్రమ్ మళ్లీ ఉత్తమ ఇన్నింగ్స్ ఆడగా, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి నిరాశపర్చారు.

CSK Vs SRH ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

మయాంక్ అగర్వాల్

118

2440

రాహుల్ త్రిపాఠి

81

1922

ఐడెన్ మార్క్రమ్

24

636

CSK Vs SRH ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్‌ ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

భువనేశ్వర్ కుమార్

151

158

నటరాజన్

40

42

ఉమ్రాన్ మాలిక్

21

29

చివరికి ఈ మ్యాచ్‌లో గెలవడం చెన్నై మరియు హైదరాబాద్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, రెండు జట్లూ వారి హోం గ్రౌండ్స్‌లో ఓడిపోయి అభిమానుల్ని చాలా నిరాశపర్చాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి రెండు జట్లు చాలా కష్టపడతాయి. గత రికార్డులను కనుక ఒకసారి పరిశీలిస్తే, SRH కంటే CSK చాలా ముందంజలో ఉంది. ఇద్దరి మధ్య 19 మ్యాచ్స్ జరిగ్గా, CSK 14  గెలవగా, SRH కేవలం 5 మాత్రమే గెలిచింది. ఈ విధంగా చూస్తే చెన్నై జట్టు పైన ఉన్నట్లు కనిపిస్తుంది. మీకు IPL 2023 గురించి పూర్తి సమాచారం కోసం Yolo247 బ్లాగ్ చూడండి

Please rate the Article
Rating 5

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !