స్నేక్స్ అండ్ లాడర్స్ నియమాలు : ముఖ్య విషయాలు

స్నేక్స్ అండ్ లాడర్స్ నియమాలు (snakes and ladders rules) అనేవి ఆటలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, విజేతగా నిలవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ గేమ్ ఆడటానికి చాలా సులభంగా ఉంటుంది. బంటులుగా పిలవబడే మీ టోకెన్లను 1వ సంఖ్య నుంచి 100వ సంఖ్య గల డబ్బాలోకి తరలించడం ఈ గేమ్ లక్ష్యం. మధ్యలో ఉండే నిచ్చెనలు త్వరగా మరియు సునాయాసంగా గెలవడానికి మీకు ఉపయోగపడతాయి. పాములు మీ గెలుపును అడ్డుకుంటాయి మరియు మీ స్థానాన్ని కిందికి జారవేస్తాయి. స్నేక్ అండ్ లాడర్స్ నియమాలు తెలుసుకోవడం ద్వారా ఈ ఆటలో విజేతగా నిలిచే అవకాశం మీకు ఉంటుంది.

స్నేక్స్ అండ్ లాడర్స్ నియమాలు – ముఖ్య సూచనలు

ఇప్పుడు మేం చెప్పే గేమ్ నియమాలు ఆట ఆడే విధానం గురించి వివరిస్తాయి. ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో నియమాలు ఒకేలా ఉంటాయి. అయితే, బెట్టింగ్ పెట్టే విధానం అయితే వేరేలా ఉంటుంది. కావున, నియమాలకు సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దశల వారీగా స్నేక్స్ అండ్ లాడర్స్ నియమాలు

మీరు దశల వారీగా స్నేక్స్ అండ్ లాడర్స్ నియమాలు తెలుసుకొని ఆటలో విజేత అవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి

  • ఒక ఆటగాడికి ఒక టోకెన్ లేదా బంటు ఉంటుంది.

  • ఎవరు గేమ్ ముందు ఆడాలనేది యాదృచ్ఛికంగా మాత్రమే ఎన్నుకుంటారు. ఎటువంటి టాస్‌లు ఉండవు.

  • ఇందులో ఒక ఆటగాడు కంప్యూటర్‌తో కలిసి ఆడవచ్చు. లేదా ఇద్దరు ప్లేయర్లు ఉంటే ఆడుకోవచ్చు. అలాగే ముగ్గురు లేదా నలుగురు కలిసి కూడా ఆడుకోవచ్చు.

  • స్నేక్స్ అండ్ లాడర్స్ ఆన్‌లైన్ గేమ్ లో ఉన్న మంచి పాజిటివ్ అంశం ఏమిటంటే, ఒక్కరు ఉన్నా కంప్యూటర్‌తో ఆడుకోవచ్చు. అయితే, ఆఫ్‌లైన్‌లో ఇలాంటి అవకాశం ఉండదు.

  • ప్లేయర్స్ బంటులను మొదటి వరుసలో ఉన్న 1వ సంఖ్య నుంచి కుడి వైపు ఉన్న మిగతా సంఖ్య వైపు తరలిస్తారు. 

  • బోర్డులో ఉన్న మొదటి వరుస తర్వాత, ఆటగాడు కుడి నుండి ఎడమకు పైన వరుసకు వెళ్లి, మళ్లీ ఎడమ నుంచి కుడికి తదుపరి వరుసకు బంటును తిప్పుతాడు. 

  • ఈ విధంగా విజేత అయ్యే వరకూ పునరావృతం చేయబడుతుంది.

  • డైస్‌ వేసిన తర్వాత వచ్చిన విలువ బంటును తరలించాల్సిన బాక్సుల సంఖ్యను సూచిస్తుంది.

  • డైస్ మీద మొత్తం ఆరు ముఖాలు ఉంటాయి. ఇందులో 1 నుంచి 6 సంఖ్యలతో ఉన్న బిందువులు (చుక్కలు) ఉంటాయి.

  • ఒక్కో ముఖం ఒక్కో సంఖ్యను సూచిస్తుంది. 

  • ఆటగాడు పాము తల ఉన్న సంఖ్య గల పెట్టె మీదకు బంటు వస్తే, వారి బంటు ఆటో మేటిక్‌గా పాము తోక వరకూ జారుతుంది. అంటే, తోక  ఉన్నపెట్టె మీదకు వస్తుంది.

  • అలాగే, నిచ్చెన ఉన్న సంఖ్య గల పెట్టె మీదకు వస్తే, ఆ నిచ్చెన పైన ఉన్న పెట్టె వరకూ బంటు పైకి ఎక్కుతాడు. ఇది బంటుకు సూపర్ శక్తి ఇచ్చినట్టు అవుతుంది.

  • ఈ విధంగా, మీరు పాములను దాటుకుంటూ నిచ్చెనల సహాయంతో 100వ పెట్టెకు చేరుకోవాలి. అప్పుడే విజేతగా నిలుస్తారు

 

స్నేక్స్ అండ్ లాడర్స్ సంప్రదాయ నియమాలు

స్నేక్స్ అండ్ లాడర్స్ సంప్రదాయ నియమాలు ఆఫ్‌లైన్‌లో ఆడే స్నేక్ అండ్ లాడర్స్ ఆట నియమాల కిందకు వస్తాయి. ఆన్‌లైన్‌లో అయితే, ఒక్కో వరుసలో ఒక్కో మల్టిప్లయర్ ఉంటుంది. ఉదాహరణకు రెండవ వరుసలో ఒక పెట్టెలో 1x మల్టిప్లయర్ ఉంటే, నాలుగవ వరుసలోని పెట్టెలో 2x, 6వ వరుసలోని పెట్టెలో 3x, చివర వరుసలో ఉన్న 100వ సంఖ్యకు చేరితే 25x మల్టిప్లయర్ ఉంటాయి. ఇవన్నీ సంప్రదాయ స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్‌లో ఉండవు. మీరు ఆట ఆడే ముందు ఎంత డబ్బు బెట్టింగ్ పెడతారో.. అందరి కంటే ముందు విజేతగా నిలిచిన వారికి మొత్తం డబ్బు చెందుతుంది. అలాగే, పాములు మరియు నిచ్చనలు ఉండే స్థానాలు కూడా స్నేక్స్ అండ్ లాడర్స్ ఆన్‌లైన్ గేమ్ మరియు సంప్రదాయ గేమ్ మధ్య వేర్వేరుగా ఉంటాయి.

 స్నేక్స్ అండ్ లాడర్స్ నియమాలు (snakes and ladders rules) ఆటకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారు కదా! అలాగే మిగిలిన ఆటల సమాచారం కోసం ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) సందర్శించండి. ఉత్తమ గేమ్స్ ఆడటానికి Yolo247 (యోలో247) సైట్ సరైన ఎంపికగా నిలుస్తుంది.

స్నేక్స్ అండ్ లాడర్స్ నియమాలు – FAQs

1: ఆన్‌లైన్‌లో స్నేక్ అండ్ లాడర్స్ గేమ్ ఆడవచ్చా?

A: అవును. మీరు Yolo247 వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా స్నేక్ అండ్ లాడర్స్ గేమ్ ఆడవచ్చు. ఇందులో ఉత్తమ మల్టిప్లయర్స్, మంచి యూజర్ ఇంటర్ ఫేస్ కలిగి ఉంది.

2: స్నేక్స్ అండ్ లాడర్స్‌ గేమ్‌లో డైస్ వేసినప్పుడు 6 వస్తే, మరో అవకాశం లభిస్తుందా?

A: అవును. మీరు డైస్ వేసినప్పుడు 6వ సంఖ్య వస్తే, మీకు మరొక అవకాశం తప్పకుండా వస్తుంది.

3: ఆన్‌లైన్ స్నేక్ అండ్ లాడర్ గేమ్ గెలవడానికి ఖచ్చితమైన నెంబర్ రోల్ చేయాలా?

A: మీరు స్నేక్ అండ్ లాడర్ గేమ్ గెలవాలంటే డైస్ వేసేటప్పుడు మీకు కావాల్సిన సంఖ్య పొందాలి. అప్పుడే గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !